calender_icon.png 26 February, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 20 రూపాయలకు డైట్ చార్జీలు పెంచాలి

18-02-2025 06:11:20 PM

ప్రభుత్వ హైస్కూల్లో స్థానిక సమస్యలు పరిష్కరించాలి

ఎస్ఎఫ్ఐ...

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగకృష్ణ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి బయ్యా అభిమన్యు మాట్లాడుతూ... ప్రభుత్వ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డైట్ చార్జీలు కేవలం రోజుకి రూ. 8 మాత్రమే ఇస్తున్నారు అన్నారు. ఈ ఎనిమిది రూపాయలతో విద్యార్థులకు ఏమాత్రం నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. కావున ప్రభుత్వం శారీరకంగా ఎదిగేటువంటి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు సరైన పౌష్టికమైన విలువలు కలిగినటువంటి ఆహారం అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందే విధంగా విద్యార్థులు చూడాలన్నారు. ప్రభుత్వమే పాఠశాలకు విద్యార్థులకు సరిపడినటువంటి మైదాన ప్రాంతం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట స్టడీ అవర్స్ లో స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామ్ చరణ్, అఖిల్, సాయి జిల్లా కమిటీ సభ్యులు వంక అఖిల్, పి.పవన్, ఉదయ్ పాల్గొన్నారు.