calender_icon.png 30 October, 2024 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతిగృహాల్లో విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంపు

30-10-2024 05:42:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్, కాస్మోటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం  పెంచింది. 3-7వ తరగత వరకు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలు రూ.1330, 8-10వ తరగతి వరకు డైట్ ఛార్జీలు రూ.1100 నుంచి 1540,ఇంటర్-పీజీ వరకు డైట్ ఛార్జీలు రూ.1500 నుంచి రూ.2100  పెంచింది. ఈ డైట్ ఛార్జీలు అన్ని వసతి గృహాల విద్యార్థులకు వర్తిస్తాయని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

డైట్ ఛార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు 40 శాతం మేర పెంచింది. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల కాస్కెటిక్ ఛార్జీలు 16 ఏళ్ల నుంచి, డైట్ ఛార్జీలను ఏడేళ్ల నుంచి పెరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 7,65,700 మంది విద్యార్థులు హాస్టల్ లో చదువుకుంటున్నారు. 3-7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను 175కి పెంచారు. 8-10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275కి పెంచారు.