16-12-2024 11:58:52 PM
వేల లీటర్ల డీజిల్ రోడ్డుపాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టి.. వాహనదారులకు చుక్కలు చూపించింది. సోమవారం మెట్టుగూడ రైలు నిలయం మార్గంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో వేలాది లీటర్ల డీజిల్ వృథా అయింది. ఆ డీజిల్ రోడ్డుపై పారడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనాలు వేగంగా ఆ డీజిల్‌పై నుంచి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అదేవిధంగా ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. కాగా, డ్రైవర్ అజాగ్రత్త వల్లే వాహనం బోల్తా కొట్టినట్లు సమాచారం.