26-02-2025 04:45:46 PM
ఆందోల్: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామనికి చెందిన బొమ్మరాజు శోభ శివరాత్రి పండుగ సందర్భంగా పూజ సామాన్లు నిత్యవసర సరుకుల కోసం 24న సోమవారం నాడు జోగిపేటకు సంతకు వెళ్లి తిరిగి బస్సులో వచ్చి చౌటకూర్ లో దిగి చౌటకూర్ నుండి బొమ్మరెడ్డి గూడెం వెళ్లేందుకు గ్రామానికి చెందిన బంధువుల ద్విచక్ర వాహనంపై బొమ్మరెడ్డి గూడెం వెళ్తుండగా చౌటకూరు సమీపంలో ఇటుక బట్టి దగ్గర జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుండి పడి బలమైన గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళారు.
తలకు అంతర్గత గాయాలు అయ్యి బుధవారం నాడు చికిత్స పొందుతూ చనిపోయింది మిత్రురాలికి భర్త గతంలో చిన్న వయసులోనే చనిపోయారు. మృతురాలికి ఒక కూతురు మాధవి వున్నారు కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతూ తన కూతురుని హైదరాబాద్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుపిస్తుంది. తన తల్లి చనిపోయిన విషయాన్ని తెలుసుకొని కూతురు తన తల్లి ఎంతో కష్టపడి నన్ను చదివించింది అని చెప్పుకుంటూ బోరున విలపించింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ వారిని పరామర్శించారు.