24-02-2025 12:00:00 AM
సందీప్ కిషన్ 30వ చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడి యోస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది.
వినసొంపైన పాటలతో ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తున్న ఈ సినిమా ట్రైలర్ విడు దల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోయిన్లు రీతూవర్మ, అన్షు, మిగ తా చిత్రబృందం అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు ఇచ్చారు.
ఇంత వినోదం థియేటర్లలో ఇవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
సందీప్ కిషన్: మజాకా సినిమా రెండుగంటల పాటు లాఫ్ రైడ్‌గా ఉంటుంది. అందుకోసం అందరం కష్టపడి పనిచేశాం. కుటుంబంతో చూసే సినిమా ఇది. -
‘మజాకా’లో ఉండే మ్యాజిక్ ఏమిటి?
డైరెక్టర్ త్రినాథ్: నేను ప్రతి సీన్‌లో మ్యాజిక్ ఉండాలని నమ్ముతా. ఇందులో కూడా ఓ మ్యాజిక్ ఉంది. సినిమాలో భావోద్వేగపూరితమైన అంశం ఉంది. ఇద్దరే మగవాళ్లు ఉన్న ఓ ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే మజాకా. -
మీరు డ్యాన్సులు చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది.. సోలో సాంగ్ వస్తే చేస్తారా?
రావు రమేశ్: చేస్తాను.. సినిమా అవకాశం రావడమే గొప్ప. అలాంటిది పాటకు డ్యాన్స్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. -మజాకాలో ప్రతి సినిమా మజాతో చేశా. ఇలాంటి సినిమా చేయడం నాకూ కొత్తే. ఇందులో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది (నవ్వుతూ).
ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక పీపుల్స్ స్టార్ ఉన్నారు.. అదే ట్యాగ్ సందీప్ కిషన్ పెట్టుకోవడానికి కారణం?
అనిల్ సుంకర: -పీపుల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో సందీప్ వన్ అఫ్ ది బెస్ట్. ఫ్యాన్స్‌ను ఇంటికి వెల్‌కమ్ చేసే హీరో. తన 30వ సినిమా లక్కీగా మా ప్రాజెక్టు కావడం ఆనందంగా ఉంది. ఆయన ఇప్పుడు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సందీప్ కాదు. అందుకే ఒక ట్యాగ్‌లైన్ ఇవ్వాలనుకున్నా. ‘పీపుల్స్ స్టార్’ ట్యాగ్ ఉత్తమం అనిపించింది. అలా ఎందుకు పెట్టానో భవిష్యత్తులో మీకూ అర్థమవుతుంది.
ఆర్ నారాయణమూర్తికి కూడా పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ఉందని మీకు తెలుసా?
సందీప్ కిషన్: ఆయనకు ఆ పేరు ఉన్న విషయం నాకు తెలియదు. ట్యాగ్‌ల మీద నేను అంత ఫోకస్ పెట్టను. ఎవరినీ నొప్పించటం నా ఉద్దేశం కాదు. ఈ ట్యాగ్ పెట్టిన తర్వాత మాకు విషయం తెలిసింది. ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో కూడా మేం ఆలోచించాం.
అనిల్ సుంకర: పీపుల్ స్టార్ అంటే ఆర్ నారాయణమూర్తి అని నేను అంగీకరిస్తాను. సందీప్ అభిమానులతో, ప్రేక్షకులతో మమేకం అవుతుంటారు. అందుకే ఈ ట్యాగ్ పెట్టాను. విషయం తెలిస్తే నారాయణమూర్తి నిజంగా సంతోషిస్తారు.