13-12-2024 01:07:30 AM
బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో ఖమ్మం రైతులు మద్దతు ధర అడిగితే వారికి బేడీలు వేశారని ఎమ్మెల్యే మందుల సామేల్ గుర్తుచేశారు. గాంధీభవన్‌లో గురువారం ఎమ్మె ల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
ఖమ్మం రైతులు.. లగచర్ల మాదిరి అధికారులపై దాడులు చేయాలేదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి ప్రజలకు ద్రోహం చేసింది వారేనని విమర్శించారు. వాళ్ల హయాంలో ఊరికొక్క రజాకార్ తయారయ్యారని ఆరోపిం చారు. పార్టీ పేరు ఎందుకు మార్చుకున్నారో, సోనియాగాంధీ ఇంటికి కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్లా రో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంప్రదాయంలో ఉంద ని, కానీ బతుకమ్మను మెజారిటీ ప్ర జలు ఆడరని పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా పెట్టలేకపోయారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్చుకొని తెలంగాణ తల్లికి ద్రో హం చేసిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే పదవెందుకని నిల దీశారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుం బం మునిగే నావ అని, ఆపడానికి ఏదైనా చేస్తారని అన్నారు. దళితలు, గిరిజనులు, చాలా బీసీ ఇండ్లలో బతుకమ్మ ఆడరని తెలిపారు. పీసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ మాట్లాడుతూ.. కళ్లుండీ చూడలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేకనే రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారని మండిపడ్డారు.