న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్, భారత యువ క్రికెటర్ ఆయుష్ బదోని ఒకే ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. ఆయుష్ ఆటను చూసి ప్రత్యర్థి బౌలర్లు మాత్రమే కాకుండా అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఇన్నింగ్స్ గురించి ఆయుష్ బదోని స్పందించాడు. నార్త్ ఢిల్లీ స్ట్రుకర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బదోని కేవలం 55 బంతుల్లోనే 165 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ 24 సంవత్సరాల చిచ్చరపిడుగు వీరవిహారంతో నార్త్ ఢిల్లీ స్ట్రుకర్స్ మీద సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ 112 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ నేపథ్యంలోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా బదోని చెరిపేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గేల్ (18) పేరిట ఉండేది. ‘నేను కేవలం బంతిని సరైన సమయంలో బాదేందుకే చూశా. ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు కొడతా అని అనుకోలేదు. నేను కేవలం బంతిని సరైన సమయంలో హిట్ చేయడం మీద దృష్టి పెట్టా. దానిని బలంగా బాదాలని అనుకోలేదు’ అని బదోని మీడియాతో చెప్పాడు.