అభయ కేసులో న్యాయం చేయాలని డిమాండ్
కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), సెప్టెంబర్ 15: బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు జూనియర్ డాక్టర్లు నిరాకరించారు. పలు డిమాండ్‌లతో మంగళ వారం నుంచి వైద్య విద్యార్థులు స్వాస్థభవన్‌లో ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతు గా శనివారం రాత్రి అక్కడకు చేరుకున్న మమత చర్చించేదుకు సిద్ధమే కాని చర్చల లైవ్ వద్దని కోరడంతో.. వైద్యులు అందుకు అంగీకరించలేదు.
దీదీ ఆహ్వానం మేరకు కాళీఘాట్‌లోని తన నివాసానికి వైద్యులు వెళ్లగా ముందు టీ తాగండి ఆ తరువాత మాట్లాడుదామని మమత కోరారు. అందుకు అంగీకరించని వైద్యులు.. అభయ కేసులో న్యాయం చేయండి ఆతర్వాతనే మేం మీ టీ ఆఫర్‌ను అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. కాగా, జూడాలు ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని బేఖాతరు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.