బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చిన నిధులను తీసుకుని కయ్యం పెట్టుకుంటామంటే ప్రజలు తెలివి లేనివారు కాదన్నారు. అందుకే తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడు దల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు ఖర్చు చేయకుండా రాష్ట్రాన్ని తిరోగ మన దిశలోకి తీసుకుపోతున్నారని, విద్య, వైద్యాన్ని నిర్వీరం చేశారని ఆరోపించారు.