calender_icon.png 22 December, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బుల కోసమే చంపేశారా?

18-09-2024 12:18:22 AM

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

మెదక్, సెప్టెంబర్ 17: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ మండలం కోంటూరు గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు(40) తనకు రావాల్సిన డబ్బుల గురించి సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం వెంకటాయపల్లిలో ఓ వ్యక్తి వద్దకు వెళ్లినట్లు అతడి భార్య తెలిపింది. సదరు వ్యక్తి వద్ద రూ.40వేలు తీసుకొని అతని బైక్‌పై కోంటూర్ వద్ద దించేసి వెళ్లినట్లు తెలిపారు.

అక్కడే ఉన్న మరో ఇద్దరు నర్సింహులును బైక్‌పై తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కోంటూ ర్ చెరువు సమీపంలో నర్సింహులు మృతదేహం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు మెద క్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నర్సింహులు వద్ద ఉన్న డబ్బులకు ఆశపడి బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.