ఆర్మూర్, జనవరి 9: రూ.300 కోసం వ్యక్తిని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో జరిగింది. నెహ్రూ కాలనీలో నివసించే మైలారపు సోమేశ్ అలియాస్ సాయిలు(60) ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుని, అమ్ముకుంటూ జీవించేవాడు.
బుధవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా అదే కాలనీకి చెందిన కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, ఒడే రవి రూ.300 కోసం సోమేశ్‌తో గొడవపడ్డారు. కోపంతో అక్కడే ఉన్న ఆయుధంతో కొట్టడంతో సోమేశ్‌కు బలమైన గాయలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.