28-02-2025 12:46:37 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రులను, ఎమ్మెల్యేలను వెంటపెట్టుకొని ఎస్‌ఎల్బీసీ టన్నెల్ వద్ద ఆందోళనకు దిగడం సిగ్గుచేటని మహేశ్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు రిస్క్యూ బృందాలు 24 గంటలు కష్టపడుతుంటే, హరీశ్.. ఆయన బృందం అక్కడికి వెళ్లి హడావుడి చేసి, ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థనైనా అక్కడికి అనుమతినిచ్చారా అని ప్రశ్నించారు.
దేశంలోని అన్ని రంగాల రెస్క్యూ బృందాలతో యుద్ధప్రాతిపదికన పని చేయిస్తుంటే, ఏం చేయాలో అర్థంకాక చేష్టలు ఉడికి కోడుగుడ్డుపై ఈకలు పీకే పని హరీశ్‌రావు పెట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.