సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకోవడమంటే సాధారణ విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధ్యమ వుతుంది. ప్రియాంకచోప్రా సైతం తన కెరీర్ ఆరంభంలో ఇబ్బందులను ఎదు ర్కొందట.
తనకు కెరీర్ ఆరంభంలో ఎదురైన అవమానాల గురించి తాజాగా ఆమె ఫోర్బ్స్ పవర్ ఉమెన్ సమ్మిట్‌లో చెప్పుకొచ్చింది. “19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టా. ఓ సినిమా కోసం సెట్‌లోకి వెళ్లి దర్శకుడిని కలిశాను. ఎలాంటి దుస్తు లు సినిమాకో అవసరమో మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పమన్నా.
అతను నా కస్ట్యూమ్ డిజైనర్ ముందే స్టులిష్ట్‌కి ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు. తన లోదుస్తులు కనిపిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్నాడు. నేను కూర్చుంటే లో దుస్తులు కనిపించాలన్నాడు. పదే పదే ఆ మాట దర్శకుడు అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది.
డిప్రెషన్‌లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి నా బాధను చెప్పుకున్నా. ఆ మరుసటి రోజే వెళ్లి నేను సినిమా చేయనని చెప్పాను. ఆ తరువాత ఇప్పటి వరకూ నేను ఆ దర్శకుడితో కలిసి పని చేయలేదు” అని ప్రియాంక వెల్లడించారు. ప్రస్తుతం ప్రియాంక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’లో నటిస్తోంది.