ఖర్గేజీ.. హైదరాబాద్‌లో రజాకార్ల హింస గుర్తులేదా?
మీ ఇల్లుతో పాటు అమ్మను కాల్చి చంపలేదా?
ఇవన్నీ మరిచి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారా?
యూపీ సీఎం యోగి
ముంబై, నవంబర్ 12: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. రెండు జాతీయ పార్టీలు సర్వ శక్తులను ఒడ్డుతున్నాయి. హామీలతో ప్రజలను కట్టి పడేస్తు న్నాయి. అయితే ఈ సమయంలో మహారాష్ట్రకు సంబంధం లేని ఇద్దరు నేతల్లో ఒకరు మరొకరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై ఉత్త రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన హింసలో ఖర్గే తన పూర్వీకులను కోల్పోయారని, అయినా అలాంటి మనస్తత్వం ఉన్న పార్టీకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.
వాళ్లకు అధికారమే ముఖ్యం
కాషాయం ధరించిన వ్యక్తులు రాజకీయా లు మాట్లాడవద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలకు యోగి కౌంటర్ ఇచ్చారు. ‘బ్రిటిష్ హయాం లో అప్పటి రాజరికంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లోని ఓ గ్రామంలో ఖర్గే ఇంటికి రజాకార్లు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఖర్గే తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. కానీ ఇవన్నీ మరిచిపోయి, తన భావాలను దాచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం ఖర్గే పని చేస్తున్నారు. ఓట్ల కోసం కుటుంబసభ్యుల త్యాగాన్ని ఖర్గే మరిచిపోయారు. యోగికి దేశ ప్రయోజనాలే ముందుంటాయి. ఖర్గేకు మాత్రం కాంగ్రెస్‌ను బుజ్జగించడమే ప్రధా నం’ అని విమర్శించారు.
ఐకమత్యమే బలం: యోగి
యోగి మాట్లాడుతూ.. ఐక్యంగా లేకపోతే విచ్ఛిన్నమవుతామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బీజేపీ కూడా ఇదే నినాదాన్ని అన్ని ప్రచార సభల్లో విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇదే సమయంలో సన్యాసులను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చేసిన వ్యాఖ్యలను యోగి ఖండించారు. అందుకే హిందువులు విడిపోతే దాడులు పెరుగుతాయని యోగి స్ప ష్టం చేశారు. ప్రధానంగా యోగి బంగ్లాదేశ్‌లో హిందువులనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్కడి హిందూ ప్రజలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడగలమని పిలుపునిచ్చారు. యోగి ఇచ్చిన ఈ నినాదం హర్యానా ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌లోనూ ప్రభావం చూపిస్తోంది. విపక్ష నేతలు సైతం యోగి నినాదంపై వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ఈ వివాదం ఎటు దారి తీయనుందో..
అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పీహెచ్‌డీ చేశాయంటూ ప్రధాని మోదీ విమర్శించారు. మహారాష్ట్ర అసెం బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రాపూర్‌లో నిర్వహించిన ప్రచా ర సభలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. గత రెండున్నరేళ్లలో మహారాష్ట్ర రెట్టింపు స్పీడ్‌తో అభివృద్ధి చెందిందన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే సీరియస్
ఎన్నికల అధికారులు తన బ్యాగును రెండు సార్లు తనిఖీ చేయడంపట్ల మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీరియస్ అయ్యా రు. తొలిసారిగా ఉద్ధవ్ బ్యాగును సోమవారం తనిఖీ చేసిన అధికారులు తాజా గా మంగళవారం కూడా చెక్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఉద్ధవ్ లాథూ ర్ వెళ్తున్న సమయంలో అధికారులు ఆయన బ్యాగును తనిఖీ చేశారు. వరుస తనీఖీలపై ఉద్ధవ్ అసహనం వ్యక్తం చేశా రు. కేవలం నా బ్యాగులను మాత్రమే తనిఖీ చేస్తారా? లేక సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాల బ్యాగులను కూడా చెక్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎన్నికల కమిషన్ తీరును ఖండించారు.