calender_icon.png 1 October, 2024 | 4:57 PM

బంగారు బొమ్మ దొరికెనమ్మో.. ఈ వాడలోన!

01-10-2024 01:39:48 AM

 కూకట్‌పల్లి/గజ్వేల్/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామ’ అంటూ మహిళలు ముందస్తు బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. బతుకమ్మ వేడుక ప్రారంభమయ్యే ఒక రోజు ముందే నగరంలోని కూకట్‌పల్లికి చెందిన మహిళలు వేడుకలు ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా సోమవారం హనుమాన్ చౌరస్తాలో ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు.

అలాగే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనూ మహిళలు బతుకమ్మలు ఎత్తుకుని ఊరేగింపు నిర్వహిం చారు. అనంతరం స్థానిక నీటికుంటల్లో నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రం ఆవరణలోనూ వేడుకలు జరిగాయి. మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.