calender_icon.png 15 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కరినైనా ప్రాణాలతో తీసుకొచ్చారా?

14-04-2025 01:42:41 AM

  1. ఎస్‌ఎల్‌బీసీ ఘటన కాంగ్రెస్‌కు చరిత్రలో నిలిచే అప్రతిష్ట
  2. పబ్లిసిటీ కోసం హెలికాప్టర్‌లో వెళ్లిరావడం తప్ప మంత్రులు చేసిందేమీ లేదు
  3. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్‌రావు మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బిసీ టన్నెల్ సహాయక చర్య ల్లో పురోగతి లేదని మాజీమంత్రి హరీశ్‌రా వు మండిపడ్డారు. ఆదివారం ఎక్స్‌లో ఆయ న ‘హ్యాష్‌టాగ్ కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’, ‘హ్యాష్‌టాగ్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కొలాప్స్’ అంటూ పోస్టు చేశారు. ప్రమాదం జరిగి 50 రోజులు అయిందని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలతో టన్నెల్ దగ్గరుండి రోదిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య రోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ల క్ష్యంతో ఎనిమిది మంది అమాయకుల ప్రా ణాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. మం త్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప ఇప్పటివరకూ ఒక్కరినీ ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదన్నారు.

ఇద్దరి మృతదేహాలు వెలికితీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. టన్నెల్ పనుల సమయంలో ముందస్తు జాగ్రత్తల్లో విఫలమైన ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు తీసుకోవడంలోనూ విఫలమైందన్నారు. పబ్లిసిటీ కోసం హెలికాప్టర్‌లో టన్నెల్ దగ్గరకు వెళ్లి రావడం మినహా చేసిందేమీ లేదన్నారు.

సహాయక బృందాలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నిర్ణయాలు తీసుకో వడంలో తీవ్ర ఆలస్యం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ట అని హరీశ్‌రావు మండిపడ్డారు. సహా యక చర్యలు కొనసాగిస్తామని చెప్పి ఇంకె న్ని రోజులు కాలయాపన చేస్తారని మండిపడ్డారు.

లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కూటికోసం కూలి కో సం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయి న వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆ దుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బిసీ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలన్నారు.