13-04-2025 12:09:38 AM
హీరోయిన్ అనగానే గుర్తుకొచ్చేది అందచందాలే. ఆ అందాన్ని ప్రదర్శించడంలో వెనునడుగు వేస్తే కెరీర్‌లో వెనకబడక తప్పడంలేదిప్పుడు. పాత్ర డిమాండ్ చేస్తే తనకు నచ్చకపోయినా ఇంటిమేట్ సీన్లలో నటించాల్సిందే. రొమాన్స్ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా మంది హీరోయిన్లు ఇబ్బందిపడే సందర్భాలెన్నో. సింహభాగం కథానాయికలు వాటిని బహిరంగంగా చెప్పుకోలేరు కూడా! అయితే, బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఇంటిమేట్ సీన్‌లో నటించేటప్పుడు తాను ఇబ్బందిగా ఫీల్ కాలేదని చెప్పింది.
2012లో ‘జన్నత్’తో చిత్రసీమలో అడుగుపెట్టిన ఈషా.. ‘ఆశ్రమ్ సీజన్3’ వెబ్‌సిరీస్‌లో సోనియా పాత్రలో మెప్పించింది. ఇందులో బాబీ డియోల్‌తో ఓ ఇంటిమేట్ సీన్‌లో బోల్డ్‌గా కనిపించి యువత మనసులను దోచుకుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా.. ఇంటిమేట్ సీన్ గురించి ప్రస్తావించింది. ‘బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్ చేయడం నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. చాలా ఇష్టంతోనే చేశాను.
అలాంటి సన్నివేశాల్లో నటించడానికి సిగ్గు ఎందుకు?! అప్పటికే పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను. పరిణతి చెందిన వ్యక్తులతో ఎలాంటి సన్నివేశాల్లో నటించినా సమస్య ఉండదు. బాబీ డియోల్ అప్పటికే అలాంటి రొమాన్స్ సీన్స్ చేసి ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఆయన కూడా గతంలో కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కథ డిమాండ్ చేసిన మేరకే ఆయన నాతో సన్నిహితంగా నటించాడు. తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బాబీ డియోల్‌కు తెలుసు. అయినా ఆ ఇంటిమేట్ సీన్ చూసినవారు నన్ను సమర్ధిస్తారనే ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.