calender_icon.png 22 February, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికన్లకు హాని చేయాలని చూశారో..

22-02-2025 12:00:00 AM

  1. ఎఫ్‌బీఐ కొత్త బాస్‌గా కాష్ పటేల్
  2. ఆమోదించిన సెనెట్
  3. ఈ పదవి చేపట్టిన తొలి ఇండియన్

వాషింగ్టన్, ఫిబ్రవరి 21: ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేట్ నియామకం అయ్యారు. ట్రంప్‌కు స్నేహితుడైన పటేల్ అభ్యర్థిత్వాన్ని అమెరికా సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదించింది. కాష్ నియామకాన్ని పలువురు రిపబ్లికన్ డెమోక్రాట్లు కూడా వ్యతిరేఖించారు.

తన నియామకం తర్వాత పటేల్ స్పందిస్తూ ఎఫ్‌బీఐలో ఎటువంటి ప్రతీకార చర్యలు, రాజకీయాలు ఉండవని తెలిపారు. కొంత మంది తన పాత కామెంట్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్-అమెరికన్‌గా కాష్ పటేల్ నిలిచారు. కాష్ పటేల్ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి.

‘ఎఫ్‌బీఐకి జీ-మెన్ నుంచి 9/11 దాడుల నుంచి దేశాన్ని కాపాడడం వరకు ఎంతో గొప్ప పేరుంది. అగ్రరాజ్య ప్రజలు ఎఫ్‌బీఐని ఎంతో విశ్వసిస్తారు. గత కొద్ది రోజుల నుంచి రాజకీయాల వల్ల ఎఫ్‌బీఐ ప్రతిష్ట మసకబారింది. ఎఫ్‌బీఐకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తా. ఎవరైతే అమెరికన్లకు హాని తలపెట్టాలని చూస్తారో.. వారు ఈ భూప్రంచంలో ఎక్కడు న్నా వారి అంతు చూసా’్త. అని పోస్ట్ చేశారు. 

కాష్ మనోడే.. 

కాష్ పటేల్ భారత మూలాలున్న గుజరాతీ కుటుంబంలో 1980లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో ఉన్న సమయంలో అక్కడి నియంత బెదిరింపుల కారణంగా వారు అమెరికాకు వలసవచ్చారు. అమెరికాకు వచ్చిన తర్వాత పటేల్ జన్మించారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆయన ఇప్పటికే వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఇప్పడు ఎఫ్‌బీఐకి 9వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.