calender_icon.png 10 January, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ స్ట్రునర్ నల్లగా మారిందా?

13-12-2024 12:00:00 AM

టీ స్ట్రునర్ ప్రతి ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఈ ఫిల్టర్ సరిగా శుభ్రం చేయకపోవడం లేదా కొన్నిసార్లు కాలిపోవడం వల్ల నల్లగా మారుతుంది. సమయానికి సరిగ్గా శుభ్రం చేయకపోతే, నల్లని మరకలను తొలగించడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు టీ స్ట్రునర్ శుభ్రం చేసుకోవాలి. టీ స్ట్రునర్ తెల్లగా, శుభ్రంగా ఉండాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

*  ముందుగా స్టునర్‌ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత దానిపై బేకింగ్ సోడా చల్లి పాత టూత్ బ్రష్‌తో రుద్దండి. అనంతరం వెనిగర్ అప్లు చేసి మరో సారి క్లీన్ చేయండి. కొన్ని నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. తర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఎంతటి మురికిగా ఉన్న స్ట్రునర్ అయినా తెల్లగా మెరిసిపోతుంది. 

*  టీ స్ట్రునర్‌ను గోరువెచ్చటి నీటితో కడగాలి. తర్వాత దానిపై ఉప్పు, నిమ్మరసంతో రుద్దాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. అనంతరం వేడి నీటితో శుభ్రం చేస్తే టీ స్ట్రునర్ తెల్లగా మెరిసిపోతుంది. 

* డిష్ వాషింగ్ లిక్విడ్‌ను వేడి నీళ్లలో మిక్స్ చేసి స్ట్రునర్‌ను ఈ మిశ్రమంలో కాసేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రష్‌తో స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో కడగాలి. 

*  సమాన పరిమాణంలో వెనిగర్, నీరు, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని టీ స్ట్రునర్ పై రుద్దండి. తర్వాత పాత బ్రష్‌తో క్లీన్ చేయాలి.

* బేకింగ్ సోడాను వేడి నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను స్ట్రునర్‌పై అప్లు చేసి రుద్దాలి. కాసేపు ఇలాగే వదిలేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే స్ట్రునర్ తెల్లగా మెరిసిపోతుంది.