మెల్‌బోర్న్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే 25 ఏళ్ల యువకుడి ప్రేమకథా చిత్రం ‘గార్డ్’. విరాజ్‌రెడ్డి చీలం హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌కు ‘రివేంజ్ ఫర్ లవ్’ అనేది ఉప శీర్షిక. మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జగా పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయరెడ్డి నిర్మిస్తున్నారు.
మెల్‌బోర్న్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ గురువారం విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి మార్క్ కెన్‌ఫీల్డ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.