- మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ కనుమరుగు
- దేశాన్ని ఏలుతామని.. సరాష్ర్టంలో చతికిల..
ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్రాన్ని తామే సాధిం చామని, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించామనే ధీమా తో దేశాన్నే ఏలుతామనే అత్యుత్సాహంతో బీఆర్‌ఎస్ పార్టీ మహారాష్ర్టలో అడుగుపెట్టింది.
తెలంగాణతోపాటు దేశాన్నే పరిపాలిస్తామంటూ ప్రచార ఆర్భా టం చేసిన బీఆర్‌ఎస్.. స్వరాష్ట్రంలోనే చతికిల పడటంతో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జెండాను ఎత్తేసినట్టుయింది. దేశ వాణిజ్య రాష్ర్టం మహారాష్ర్టలో సత్తా చాటుతామన్న బీఆర్‌ఎస్ ఎన్నికల్లో పోటీ చేయకుండానే కనుమరుగయ్యింది.
మహారాష్ర్ట గ్రీన్‌సిటీ అయిన నాగ్‌పూర్‌లో ఏడాది క్రితం హడావిడిగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట కార్యాలయం ఏర్పాటు చేసుకుని, భారీ బహిరంగ సభలు నిరహించిన బీఆర్‌ఎస్ నేతలు మహారాష్ర్ట ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ అదే ఊపులో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు సైతం నిరహించింది.
నాందేడ్, ఔరంగాబాద్, నాగ్‌పూర్ పట్టణాల్లో పార్టీ కార్యాలయాలను తెరిచారు. ఇప్పుడు వాటి ని తెరవడం లేదు. అప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా బరిలో ఉం టుందని ప్రకటించడంతో మహారాష్ర్టలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోవడంతో స్వరా ష్ర్టంలోనే నేతలను కాపాడుకునేందుకు పార్టీ కష్టాలు ఎదుర్కుంటోంది. దీంతో మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మచ్చుకైనా కనబడటం లేదు. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో గులాబీ జెండాలు కనిపించకపోగా, తెలంగాణ బీఆర్‌ఎస్ నేతలు రాష్ర్ట సరిహద్దులు దాటడం లేదు.