calender_icon.png 21 October, 2024 | 9:19 AM

క్యారియర్ భోజనం తిన్నారా..

21-10-2024 12:00:00 AM

ఆనాటి వస్తువుల్లో క్యారియర్ (టిఫిన్ బాక్స్) ప్రత్యేతకంగా ఉండేది. మగవాళ్లు ఏ పొలం పనులకో, ఇతర పనులకో వెళ్లేటప్పుడే ఆడోళ్లు వేడి వేడి భోజనం సిద్ధం చేసి ఇచ్చేవారు. కింద పెద్ద బాక్సులో అన్నం, చిన్న బాక్సుల్లో పలు రకాల కూరలు పెట్టి చేతికందించేవాళ్లు. పొద్దుగాళే మగవాళ్లు పొలం పనులకు వెళ్తే.. ఆడోళ్లు ఇంట్లో పనులు పనిచేసుకొని మధ్యాహ్నానికల్లా క్యారియర్‌ను పట్టుకువేళ్లేవారు.

ప్రయా ణాల్లో ఇంటిల్లిపాదికీ అదే ఆధారం. ఆ టిఫిన్ బాక్సుల డిజైన్ కూడా విచిత్రంగా ఉండేది. తినడానికి ఒక చెంచా ఉండేది. ఆ చెంచా హ్యాండిల్ కింద అమర్చబడి క్యారియర్‌ను లాక్ చేసేవిధంగా ఉండేది. రాగి క్యారియర్‌లో భోజనం తినడం వల్ల తాజా ఆహారం అందేది. కాలం మారడంతో వీటి స్థానంలో ప్రస్తుతం రంగు రంగుల ప్లాస్టిక్ బాక్స్‌లు దర్శనమిస్తున్నాయి.