calender_icon.png 7 January, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూఇయర్ వేడుక కోసం రాహుల్ వియత్నాం వెళ్లారా?

31-12-2024 02:27:35 AM

* మన్మోహన్‌సింగ్ సంతాప దినాల వేళ..

* ఆయన విదేశీ పర్యటనపై బీజేపీ విమర్శలు

* ఆ కుటుంబానికి ప్రైవసీ ఇచ్చాం.. అందుకే ఆస్తికల నిమజ్జనానికి దూరంగా ఉన్నాం: కాంగ్రెస్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో యావత్ దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తున్న వేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటన వివాదాస్పదమైంది. దీంతో జాతీయ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. ఏడు రోజుల పాటు మన్మోహన్‌సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వియత్నాం వెళ్లార ంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

‘మన్మోహన్‌సింగ్ సంతాప దినాల వేళ  రాహుల్ న్యూఇయర్ వేడుకలకు వెళ్లారు’ అంటూ సోమవారం బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాలవీయ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘26/11 ముంబై దాడి జరిగిన రోజు రాహుల్‌గాంధీ రాత్రంతా పార్టీ చేసుకున్నాడు. ఆయన్ను అనేక అవమానాలకు గురిచేశారు.

మన్మోహన్‌సింగ్ అంతిమసంస్కారాలు పూర్తయిన తర్వాత కనీసం ఆయన అస్తికలను తీసేందుకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత వెళ్లలే దు. మన్మోహన్‌సింగ్ భారతరత్నకు అర్హుడని, మన్మోహన్‌సింగ్ మరణం రాహుల్‌గాంధీని ఏమాత్రం బాధించడం లేదు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పూనావాలా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. 

విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్..

మన్మోహన్‌అస్తికల నిమజ్జనానికి రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతలు హాజరుకాకపో వడంపై బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ‘అస్తికలు యమునా నదిలో కలి పే కార్యం పూర్తిగా మన్మోహన్‌సింగ్ కుటుంబానికి సంబంధించింది. ఆయన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఈ విషయ ంలో ఆయన కుటుంబ సభ్యులనూ సంప్రదించాం. దుఃఖ సాగరంలో  ఉన్న కుటుంబ సభ్యులను మేం పెద్దగా ఒత్తిడి చేయలేదు. నిమజ్జనం తర్వాత సోనియా, ప్రియాంక ఆ కుటుంబాన్ని పరామర్శించారు’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సోమవారం ప్రకటించారు.