calender_icon.png 26 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ దీక్ష ఫలించిందా?

26-11-2024 12:00:00 AM

ఎన్‌టీ రామారావు, జమున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’దీక్ష‘. ఈ సినిమా 1974 నవంబర్ 26న విడుదలైంది. జమున, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజాబాబు, అంజలీదేవి కీలక పాత్రల్లో నటించారు. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు నిర్మించారు. చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ‘మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక’ పాట ఈ చిత్రంలోనిదే.

రామయ్య (జగ్గయ్య) అనే రైతు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ తన భార్య శాంతమ్మ (అంజలీదేవి), కుమారుడు రాజా (ఎన్టీఆర్), కుమార్తె కమల (కేఆర్ విజయ)తో సంతోషంగా జీవిస్తుంటాడు. ఆ భూమిపై కన్నేసిన జగన్నాథం (ప్రభాకర్ రెడ్డి) మోసం చేసి దానిని ఫోర్జరీతో తన పేరు మీదకు మార్పించుకుంటాడు. దీంతో మనోవేదన చెందిన రామయ్య మరణిస్తాడు.

మరణానికి ముందు ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని రాజా నుంచి ప్రమాణం తీసుకుంటాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది. చివరకు రాజా ఆ భూమిని తిరిగి ఎలా సొంతం చేసుకోవాలనే దీక్ష ఫలించిందా? వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.