calender_icon.png 14 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులకు మంత్రులు ఆదేశాలిచ్చారా?

14-01-2025 12:44:13 AM

*  మీటింగ్‌ను కంట్రోల్ చేయడంలో మంత్రుల ఫెయిల్

* కక్షపూరితంగా ప్రతిపక్షనేతలపై కేసులు

* ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, జనవరి 13 (విజయక్రాంతి): ముగ్గురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా పాల్గొన్న అధికారిక సమీక్షా సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేను పోలీసులచేత నెట్టివేయించడం వెనక మంత్రుల ఆదేశాలున్నాయోమోనని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పైగా ప్రశ్నించిన తమ ఎమ్మెల్యేనే గొడవకు కారణమంటూ అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు.

గతంలో జరిగిన ఎన్నో సమావేశాల్లోనూ రాజకీయ ఘర్షణలు జరిగేవని అప్పుడు ఎవరిపైనా కేసులు పెట్టలేదని చెప్పారు. కక్షపూరితంగా కేసులతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించడం మానుకోవాలని ఆయన అన్నారు. కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసుల విషయమై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలోని తన నివాసం లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాదారు.

అధికారిక సమావేశానికి తమను ఆహ్వానిస్తేనే తాను, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వెళ్లామని  చెప్పారు. సమావేశ ప్రారంభంలోనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తన పక్కనే కూర్చున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాటలతో అసహనానికి గురి చేశాడని, ఈ విషయం ఉద్రిక్తత అనంతరం కౌశిక్‌రెడ్డి తనకు చెప్పారని గంగుల కమలాకర్ తెలిపారు.

అందుకే ‘ముందు నీది ఏ పార్టీయో చెప్పి ప్రసంగిం చాలి’ అంటూ అడిగిన కౌశిక్‌రెడ్డిపైనే సంజయ్ దురుసుగా ప్రవర్తించారని, అందుకు కౌశిక్‌రెడ్డి సైతం ధీటుగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న మంత్రులు అడ్డుకోకపోగా.. క్షణాల్లో వచ్చిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని లాక్కెళ్లుతూ బయటకు నెట్టేశారని తెలిపారు.

ఇది మంత్రుల అనుమతితోనే జరిగిందా? లేకపోతే పోలీసుల అత్యుత్సాహంగా వ్యవహరించారా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నో జడ్పీ, మున్సిపల్ సమావేశాలు, జిల్లా అభివద్ధి రివ్యూ మీటింగ్లు జరిగాయని, అప్పుడు కూడా రాజకీయంగా అయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారని, సమావేశంలోనే నిరసనకు దిగిన సంద ర్భాలూ ఉన్నాయని వివరించారు.

అప్పుడు ఏ ఒక్క నేతపైనా కేసులు పెట్టలేదని, సమా వేశంలోని నేతలు ఘర్షణను సద్దుమణి పించి యధావిథిగా మీటింగ్లు నిర్వహించా రని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, రాజకీయ విమర్శలు చేసినా సహించకుండా ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నేతనే పోలీసుల చేత బయటకు నెట్టేయిం చడం దారుణమున్నారు. కరీంనగర్ సమావేశంలో మజగిత్యాల ఎమ్మెల్యే సైతం దురుసుగా ప్రవర్తించినా ఆయన్ను వదిలేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు.