calender_icon.png 8 January, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసింది... చెయ్యబోయేది చెప్పండి

03-01-2025 01:05:46 AM

  • ప్రజల ముందు వాస్తవాలను ఉంచి వివరాలు ఇవ్వండి 

అవినీతి రహిత ప్రజాపాలనే ప్రభుత్వ లక్ష్యం 

వార్షిక అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్ జనవరి 2 (విజయ క్రాంతి) : వాస్తవ పరిస్థితులను ప్రజలకు పూర్తిగా వివరంగా అందజేస్తూ చేసింది చేయబోయేది సమగ్రంగా వివరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివా సరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలె క్టర్ విజయేందిర బోయి, జిల్లా అధికారు లతో కలిసి ఏర్పాటుచేసిన  సమీక్ష సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

అవినీతి రహిత ప్రజాపాలన ప్రజలకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అను గుణంగా జిల్లా అధికారులు సైతం ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కొత్త సంవత్స రం లోకి స్వేచ్ఛగా, సంతోషంగా అడుగు పెట్టబోతున్నామన్నారు.   మాది అధికారుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. సంవ త్సర క్రితం డిసెంబర్ 7 న  ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నో  విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని చెప్పారు.

ప్రభుత్వం ప్రాధాన్యత ఇప్పుడి ప్పుడే అధికారులకు అర్థం అవుతుందని, మేము పాలకులం కాదు సేవకులమని పునరుద్ఘాటించారు.  అక్కడక్కడా కొందరి లో ఆలసత్వం ఉందని, తమ దృష్టికి వచ్చిన చిన్న చిన్న పనులను సైతం పెండింగ్‌లో పెట్టవద్దని,  సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని ఆదేశించారు. 

గతంలో తెలిసో తెలియక చేసిన తప్పిదాలను, అలసత్వాన్ని వదిలి, ప్రజా ప్రభుత్వం ప్రజలకోసం పడు తున్న ఆరాటాన్ని అధికారులు అర్థం చేసుకొ ని సమన్వయం తో కలిసి పనిచేసి మహ బూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు మరింత చేరువగా, సమర్థవం తంగా, మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నత మాకు సమాచారం అందించాలని, మన అందరి లక్ష్యం ప్రజల సంక్షేమ అనే విషయాన్ని ప్రతి అధికారి గుర్తించి అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. ప్రజలకు మంచి చేయడం తప్పితే మనకు అంతకంటే ముఖ్యమైన పని ఏముంటుందని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.