న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను అత్యంత పిన్న వయసులో గెలుచుకు న్న గుకేశ్ దొమ్మరాజు తెలుగు వాడా? లేక తమిళనాడుకు చెందిన వ్యక్తా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన లీడర్లు గుకేశ్ తమ వాడంటే, తమ రాష్ట్రం వాడని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెర లేసింది. ఇదంతా నచ్చని కొంత మంది గుకేశ్ ఏ రాష్ట్రానికి చెందినవాడైనా అతడు భారతీయుడు అని చెప్పినా కానీ ఈ చర్చకు పుల్ స్టాప్ పడడం లేదు.
అసలేందిదీ...
గుకేశ్ విజయం సాధించిన తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేది కగా స్పందిస్తూ అతడు తమిళనాడుకు గర్వకారణం అన్నారు. దీంతో గుకేశ్ ఆంధ్రప్రదే శ్‌కు చెందిన వ్యక్తి అని కొంత మంది కొత్త రాగం అందుకున్నారు. అది అలా కొనసాగుతున్న తరుణంలోనే.. తమిళనాడు డిప్యూ టీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ‘అవర్ వెరీ ఓన్ గ్రాండ్‌మాస్టర్’ గుకేశ్ అంటూ సంభోదించారు. దీంతో కొంత మంది గుకేశ్‌ది ఆంధ్రప్రదేశ్ అంటూ అతడి బయోను షేర్ చేయడం మొదలుపెట్టారు.
అటు తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కూడా గుకేశ్‌కు అభినందనలు చెబుతూ ‘అవర్ వెరీ ఓన్ తెలుగు బాయ్’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ పోరు మరింత ఎక్కువయింది. కొంత మంది గుకేశ్ తమిళ వ్యక్తి అంటుంటే మరికొంత మంది తెలుగు వ్యక్తి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
గుకేశ్‌కు 5 కోట్లు..
తమిళ సీఎం స్టాలిన్ ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌కు రూ. 5 కోట్ల నజరానా ప్రకటించారు. గుకేశ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకున్నారు. గుకేశ్ విజయంపై రష్యా చెస్ ఫెడరేషన్ సంచలన ఆరోపణలు చేసింది. లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది. ‘లిరెన్ చర్యలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే అతడు ఓడినట్లు అనిపిస్తోంది. దీనిపై ఫిడే విచారణ చేయాలి’ అని రష్యా ఫెడరేషన్ చీఫ్ ఫిలటోవ్ డిమాండ్ చేశారు.