calender_icon.png 18 January, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దులీఫ్ చేశారా..

09-09-2024 03:14:57 AM

  1. 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ 
  2. అయ్యర్‌కు నిరాశ 
  3. 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు 
  4. దులీప్ ట్రోఫీ ప్రదర్శన పరిగణలోకి తీసుకున్నారా? 

బంగ్లాతో సిరీస్‌కు దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లే ప్రామాణికం.. సరైన ఆటతీరు కనబర్చకుంటే వేటు తప్పదు ఎవరైనా సరే నిరూపించుకుని రావాల్సిందే ఇక్కడ పర్ఫామ్ చేసిన వారికే బంగ్లాతో టెస్టుకు అవకాశం ఇది బీసీసీఐ ప్రకటన.. ఈ ప్రకటనతో దులీప్ ట్రోఫీ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఎలా ఆడతారనే దానిని బట్టే జట్టు ప్రకటన ఉంటుందని అంతా నమ్మారు. కట్ చేస్తే.. 

ముంబై: బీసీసీఐ చెప్పినట్లుగానే దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాతనే బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం భారత జట్టు ప్రకటన వెలువడింది. దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ బీ పోరులో బీ జట్టు.. ఇండియా సీ డీ పోరులో సీ జట్టు విజయం సాధించాయి. రెండు మ్యాచెస్ జరిగినా కానీ ఎక్కువ మంది ఆకర్షించింది... మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడింది మాత్రం బీ జట్టు యువ ప్లేయర్ ముషీర్ ఖాన్. బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం చూస్తే అతడికి జట్టులో తప్పకుండా స్థానం లభించాలి. కానీ బంగ్లాతో తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతడికి చోటు కరువైంది. అక్కడే ఈ ప్రదర్శనను అసలు పరిగణలోకి తీసుకున్నారా? అని అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పెద్దగా రాణించని ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. 4 జట్లుంటే కేవలం ఏ జట్టు కెప్టెన్ గిల్‌కు మాత్రమే చోటు దక్కింది.

ఎంపికైన ఆటగాళ్లు. వారి ప్రదర్శనలు.. 

తుస్సుమన్న ప్రిన్స్..!

టీమిండియాలో ప్రిన్స్‌గా అభిమానుల మన్ననలు అందుకున్న యువ ఆటగాడు గిల్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 25+21 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. మరి బంగ్లా సిరీస్‌కు గిల్‌ను పరిగణలోనికి తీసుకుంటారో లేక ప్రత్యామ్నాయం చూస్తారో వేచి చూడాలి. 

కేఎల్ క్లాస్ మిస్.. 

ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అనే పేరు ఉంది. కానీ దులీప్ ట్రోఫీలో మాత్రం రాహుల్ తన క్లాస్ చూపెట్టడంలో విఫలం అయినట్లు కనిపించింది. ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్ మొదటి ఇన్నింగ్సులో 37 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 57 పరుగులు చేసినా కానీ తన క్లాస్ చూపెట్టడంలో విఫలమయ్యాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

జైస్వాల్ జోరు చూపాడా?

కొన్ని రోజుల నుంచి టీమిండియాలో ఓపెనర్ స్థానానికి గట్టి పోటీనిస్తున్న యశస్వి జైస్వాల్ ఈ దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరఫున బరిలోకి దిగాడు. ఇక ఈ ఓపెనర్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 30+9 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా నిరాశపర్చాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి సెలెక్టర్లు ఈ ఓపెనర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. 

పంత్ ఫిట్‌గా ఉన్నాడా? 

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత టెస్టు క్రికెట్ ఆడని ఇండియా కీపర్ పంత్ దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచులో ఎవరికీ అంతుచిక్కని ప్రదర్శన చేశాడు. ఇండియా బీకి కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పంత్.. మొదటి ఇన్నింగ్సులో 7 పరుగులతో నిరాశపర్చగా.. రెండో ఇన్నింగ్సులో మాత్రం 61 పరుగులతో పర్వాలేదనిపించాడు. 

జురెల్ ఎంపిక కరెక్టేనా.. 

ఇండియా ఏ జట్టుకు కీపర్‌గా వ్యవహరించిన ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం  2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. అతడు కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ అతడు మాత్రం బంగ్లాతో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఒకే ఇన్నింగ్సులో ఏడు క్యాచెస్ అందుకుని మాజీ సారధి ధోని రికార్డును మాత్రం సమం చేశాడు. 

సర్ఫరాజ్ ఏదో అలా.. 

సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. మొదటి ఇన్నింగ్సులో 7, రెండో ఇన్నింగ్సులో 36 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. 

అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షో.. 

ఇండియా డీ తరఫున బరిలోకి దిగిన అక్షర్ పటేల్ మొదటి ఇన్నింగ్సులో 86 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 28 పరుగులు చేశాడు. అంతే కాక బౌలింగ్‌లో మొదటి ఇన్నింగ్సులో 2, రెండో ఇన్నింగ్సులో ఒక వికెట్ తీసుకున్నాడు. 

కుల్దీప్ ఎంపిక కరెక్టేనా? 

ఇండియా ఏ తరఫున ఆడిన కుల్దీప్ మ్యాచ్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. 

ఆకాశ్‌దీప్‌కు అవకాశం.. 

ఇండియా ఏ తరఫున ఆడిన ఆకాశ్‌దీప్ మొదటి ఇన్నింగ్సులో 4 వికెట్లు, రెండో ఇ న్నింగ్సులో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతడికి చోటు దక్కడంతో అభిమానులు కొంత రిలాక్స్ అవుతున్నారు. దులీప్ ట్రోఫీ వల్ల ఒక్కరికైనా న్యాయం జరిగిందని అంటున్నారు. 

దయాల్‌కు తుది జట్టులో చోటు దక్కేనా?

ఇండియా బీ జట్టు తరఫున ఆడిన యశ్ దయాల్ మొదటి ఇన్నింగ్సులో 1 వికెట్, రెం డో ఇన్నింగ్సులో 3 వికెట్లు తీసుకుని ఇండి యా బీ విజయంలో కీలక పాత్ర పోషించా డు. కానీ బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లు ఉం డగా.. యశ్ దయాల్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. 

ఇక జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా, బౌలర్లు బుమ్రా, సిరాజ్ దులీప్ ట్రోఫీ ఆడలేదు. వారికి బీసీసీఐ మినహాయింపునిచ్చిన 

విషయం తెలిసిందే. 

జట్టు: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్, బుమ్రా, యశ్‌దయాల్