- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
- బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, జనవరి 2: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఏ ఒక్క సమస్యనైనా కేంద్రమంత్రి బండి సంజయ్ పరిష్కరించారా అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం ముల్కనూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 50 వేల ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. గృహలక్ష్మీ, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాల్సి ఉం దన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అనేక వాగ్దానాలతో ప్రజలను దగా చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటా లన్నారు. సమావేశంలో కొమురవెల్లి చంద్రశేఖర్‌గుప్తా, కేతిరి లక్ష్మారెడ్డి, ఊసకోయిల ప్రకాశ్, చిదురాల స్వరూప, పిడిశెట్టి కనకయ్య, కొలుగూరి రాజు, ఆదరి రవిందర్, చిట్టంపల్లి అయిలయ్య పాల్గొన్నారు.