calender_icon.png 24 November, 2024 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో నియంత పాలన

24-11-2024 12:12:43 AM

  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఫైర్
  2. జైలులో పట్నంతో ములాఖత్

కాప్రా, నవంబర్ 23: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నియంత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల పక్షాన పోరాడిన నరేందర్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా అరెస్టు చేయించారన్నారు. కొడంగల్‌లో అక్కరకు లేని ఫార్మా కంపెనీ కోసం రైతులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారిపై అక్రమ కేసులను బనాయించి అరెస్టు చేశారన్నారు.

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డిపై కక్షపూరితంగా ఆయన ఇంటి ఎదురుగా గోడ కట్టడంతో ఆయన అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు సీఎం, ఆయన బంధువులు చేస్తున్న అరాచాకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

చేయని తప్పులకు జైలులో మగ్గుతున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, లగచర్ల రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంద న్నారు. ఆయనవెంట మాజీ మం త్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్‌ఎస్ నేత రాగిడి లక్ష్మారెడి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొ రేటర్లు.. దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, శాంతిసాయిజెన్ శేఖర్ తదితరులు ఉన్నారు.