calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో నియంతృత్వ పాలన సాగుతుంది

09-04-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ దండే విఠల్ 

కాగజ్ నగర్, ఏప్రిల్ 8(విజయ క్రాంతి): దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ దండే విఠల్ ఆరోపించా రు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్‌రావుతో కలసి పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవహేళన చేస్తూ మాట్లాడిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దేశ రాజ్యాంగాన్ని మార్చాలని పదేపదే ప్రయత్నం చేస్తున్న బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, సామాజిక, సమానత్వాన్ని బిజెపి నుండి ముప్పు ఉందని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాం గ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, కాంగ్రెస్ పార్టీ  నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.