calender_icon.png 4 March, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాఠశాల వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

04-03-2025 04:55:49 PM

సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో సింగరేణి ఉన్నత పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించాలని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్(Singareni Educational Society Secretary G. Srinivas) కోరారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశా లలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పాఠశాల ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతుండడంతో ఈ సంవత్సరం జూన్ మాసంలో పాఠశాల ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. వజ్రోత్సవ వేడుకలకు సింగరేణి సి అండ్ ఎండీ బలరాం నాయక్(Singareni CMD Balaram Nayak) తో పాటు సింగరేణి ఉన్నతాధికారులు హాజరవుతున్నారని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులతో పాటు ఉన్నత స్థాయిలో నిలిచిన వారి అనుభవాలు, పాఠశాల లో విద్యాబోధన, ఉపాధ్యా యుల కృషి విద్యార్థుల పట్టుదల అన్నింటిని క్రోడీ కరించి వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సావనీరును ఆవిష్కరించడం జరుగు తుందన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుతున్న నాటి నుండి నేటి వరకు సుమారు 50 వేల మంది విద్యార్థులకు విద్యనందించి చదువుల తల్లిగా సరస్వతి దేవాలయంగా పాఠశాల బాసిల్లుతుందన్నారు. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో తొమ్మిది పాఠశాలలు మహిళా జూనియర్ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలు నిర్వహిస్తుండగా సుమారు 8000 మంది విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి నాణ్యమైన విద్య అందించడమే కాకుండా  క్రీడలు, అథ్లెటిక్స్, మ్యూజిక్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించే లక్ష్యంతో యోగా మెడిటేషన్ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సింగరేణి పాఠశాలల బలోపేతానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తుందని దీనిలో భాగంగా సింగరేణి మహిళా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో అధునాతన కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు పాలిటెక్నిక్ కాలేజీలో ఏఐఎంఎల్ నూతన కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు. సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ ఈ సిలబస్ ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ విద్యా సంవత్సరం గోదావరిఖని సెక్టార్ 3 పాఠశాలలో ప్రయోగాత్మకంగా సీబీఎస్ఈ అమలు చేయడం జరుగు తుందన్నారు. పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి యజమాన్యం కృషి చేస్తుందని దీనిలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాద్యా యులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణా లపై చర్చించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా విద్యార్థులు క్రమ శిక్షణ సమయ పాలన పాటించేలా చూడడంతో పాటు రోజువారీగా పాఠశాలకు హాజరయ్యేల శ్రద్ధ వహించేలా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

సింగరేణి పాఠశాలల్లో మెరుగైన నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎగ్జిబిషన్స్ ఎడ్యుకేషన్ టూర్ మ్యాథ్స్ ఓలంపియాడ్ వంటి వాటితో పాటు క్రీడారంగంలో ప్రత్యేక శిక్షణ అందించి వారిలో నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నా మన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో సింగరేణి  వ్యాప్తంగా ఉన్న ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్, టీచర్లతో పాటు బిపిఈటి పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు వారి అభిరుచికి అనుగునంగా వారు ఎంచు కున్న అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడతాం అన్నారు. జూన్ లో నిర్వ హించనున్న వజ్రోత్సవాలను పాఠశాల పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసి  పండుగ వాతా వరణంలో నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహస్వామి, శ్రీరాంపూర్ సింగరేణి ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయు లు సంతోష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.