నందమూరి తారక రామారావు నటించిన మొదటి సినిమా ‘మనదేశం’. సీనియర్ డైరెక్టర్ ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా.. నాగయ్య, నారాయణరావు, కృష్ణవేణి కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ రచయిత శరత్‌బాబు రాసిన ‘విప్రదాస్’ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తెరంగేట్రం చేశారు. ఇందులో ఆయన పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపించారు.
1949 నవంబర్ 24న అది విడుదలైంది. ఎన్టీఆర్ చిత్రసీమలోకి అడుగుపెట్టి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాన్ని డిసెంబర్ 14న విజయవాడలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “నేను అనునిత్యం స్మరించే పేరు..
నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై ‘మనదేశం’తో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24వ తేదీతో 75 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ‘వజ్రోత్సవం’ చేసుకుంటున్న ఇదే ఏడాదిలో హీరోగా నేను 50 ఏళ్లు పూర్తి చేసుకొని కళామతల్లి సేవలో ‘స్వర్ణోత్సవం’ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం” అని పేర్కొన్నారు.