15-03-2025 12:18:11 AM
భద్రాచలం (విజయ క్రాంతి): భద్రాచలం డిపో పరిధిలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానని భద్రాచలం ఆర్టిసి డిపో మేనేజర్ తిరుపతి తెలిపారు. డిపో మేనేజర్ తిరుపతి శుక్రవారం డయల్ యువర్ డి ఎం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ప్రయాణికులు ఫోన్ ద్వారా పలు సమస్యలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకొని వచ్చారు.
ముఖ్యంగా బూర్గం పహాడ్ బస్టాండ్ నందు టైం టేబుల్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించాలని కోరగా వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా భద్రాచలం నుండి కరీంనగర్ వెళ్లే బస్సు తో పాటు పలు బస్సుల సమయాలను మార్చాలని కోరగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
అలాగే కుదునూరు స్టేజి వద్ద, కలివేరు శివాలయం వద్ద బస్సులను ఆపాలని పలువురు కోరగా ఆపటానికి డ్రైవర్స్ ఆదేశాలు ఇస్తామని తెలిపారు. భీమవరం సర్వీసు కూడా కొత్త బస్సులు రాగానే ప్రారంభిస్తామని హైదరాబాదులోని కూకట్పల్లికి ఇప్పుడు వరకు ఐదు సర్వీసులు ఉన్నాయని ఇంకా అవసరమైతే పరిశీలిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.