calender_icon.png 15 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుమేహం @7.42 కోట్లు

15-11-2024 01:44:07 AM

2045 నాటికి 12.49 కోట్ల కేసులు

ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10.5 శాతం జనాభా (53.7కోట్ల మంది) మధుమేహంతో బాధపడుతున్నారని, 2045 నాటికి ఈ సంఖ్య 78.3 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా వేస్తున్నట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. చిన్నారులకు వచ్చే టైప్ మధుమేహం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. మన దేశంలో సుమారు 2,29,400 మంది పిల్లలకు టైప్ మధుమేహం ఉందని.. ప్రపంచంలోనే ఇవి అత్యధిక కేసులని వివరించారు.

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గురువారం నిమ్స్ హాస్పిటల్‌లో టైప్‌హా మధుమేహంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మధుమేహం కేసులు స్థిరంగా ఉండగా.. మనదేశంతో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. దేశంలో ప్రస్తుతం మధుమేహం ఉన్నవారి సంఖ్య 7.42 కోట్లు కాగా.. 2045 నాటికి 12.49 కోట్లకు చేరుతుందని తెలిపారు.

ఆందోళన కలిగిస్తున్న టైప్ డయాబెటిస్

టైప్ మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సులిన్ పంపులు అందించడానికి నిమ్స్ వైద్యులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప, డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతవీర్ టైప్ మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వారు సూచించారు.