calender_icon.png 31 October, 2024 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూళికట్ట స్థూపం.. బౌద్ధక్షేత్రం

31-10-2024 12:00:00 AM

తెలంగాణలో అనేక పురాతన చారిత్రక స్థలాలున్నాయి. అలాంటివాటిలో ధూళికట్ట బౌద్ధ స్థూపం ఒకటి. పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట అనే గ్రామ శివారులోఈ స్థూపం అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ స్థూపం చక్రాకార పథం కలిగి ఉంటుంది. స్థూపం ఎత్తు 9 నుంచి 12 అడుగులు కాగా, వ్యాసం 132 అడుగులు. చుట్టూ ఇటుకలను పద్మాకారంలో అమర్చి ఉంటుంది. స్థూపం చుట్టూ ప్రదక్షిణ పథం, అంచున పాలూరి ప్రాకారం ఉన్నాయి.

ఇక్కడ అభివృద్ధి చేసేందుకు కొన్నేళ్ల కిందట అధికారులు తవ్వకాలు చేపట్టగా పూర్వకాలంలో వారు వాడిన కొన్ని పరికరాలు కూడా బయటపడ్డాయి. అవన్నీ కరీంనగర్ లోని మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధ పూర్ణమి రోజున బౌద్ధమతస్థులు వేడుకలు నిర్వహిస్తారు. ధూళికట్టను దేశంలో అతిపెద్ద క్షేత్రాల్లో రూపుదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.