calender_icon.png 19 January, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌గా ధృవీ పటేల్

21-09-2024 12:00:00 AM

ప్రవాస భారతీయుల ప్రతిష్టాత్మక ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థిని ధృవీ పటేల్  మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేతగా నిలిచింది. ధృవీ బాలీవుడ్ హీరోయిన్‌గా రాణించాలని..  యునిసెఫ్ అంబాసి డర్ కావాలని కోరుకుంటుంది. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ గెలవడం చాలా గొప్ప గౌరవం. ఈ గౌరవం ప్రపంచ స్థాయిలో ఇతరులకు స్ఫూర్తినిచ్చే అవకాశా న్ని సూచిస్తుంది’  అని న్యూజెర్సీలో విజేతగా నిలిచిన తర్వాత ఆమె అన్నారు. అయితే ఇదే రేసులో సురినామ్‌కు చెందిన లిసా అబ్డోల్ హక్ మొదటి రన్నరప్‌గా, నెదర్లాండ్స్‌కు చెంది న మాళవిక శర్మ రెండో రన్నరప్‌గా నిలిచారు.

గుజరాతీ సంతతికి చెందిన ధృవీ పటేల్  2023లో కూడా మిస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ కిరీటం దక్కించుకుంది. ఒకవైపు చదువుతూనే.. మరోవైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తోంది. ఈ బ్యూటీ తన ఇంటి నుంచే ‘3డీఎస్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. పేదల ఆకలి తీర్చడంలో భాగంగా నిధుల సేకరణ కూడా చేస్తోంది. యూనిసెఫ్, ఫీడింగ్ అమెరికా వంటి స్వచ్ఛంద సంస్థలకు క్రమం తప్పకుండా విరాళాల ద్వారా విరాళాలు ఇస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాలో 18.6కె మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. గుజరాతీతో పాటు ఇతర భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది.