calender_icon.png 22 November, 2024 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఐదో వికెట్ డౌన్.. 72/5

22-11-2024 11:13:02 AM

పెర్త్‌లో వేదికగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో 1వ రోజు లంచ్‌కు ముందు ఆస్ట్రేలియా నాలుగు ముఖ్యమైన వికెట్లు తీయడంతో మొదటి సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచులో ఇప్పటికే భారత్ సగం వికట్లను కోల్పోయింది. ధ్రువ్ జురెల్ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ తర్వాత మూడో ఓవర్ లోనే ఆసీస్ కు వికెట్ దక్కింది. మిచెల్ మార్ష్ వేసిన బంతిని ఆడబోయిన ధ్రువ్ జురెల్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో లబుషేన్ చేతికి చిక్కింది. ప్రస్తుతం భారత్ 31.1 ఓవర్ లో 71 పరులుగుల చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (04), రిషబ్ పంత్(17)తో ఆడుతున్నారు.

జైస్వాల్, పడిక్కల్‌లను డకౌట్ చేయడంతో టీమ్ ఇండియా ఆరంభంలోనే తడబడింది. ఇన్నింగ్స్‌ను నడిపించాలని చూసిన కేఎల్ రాహుల్‌కు  వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి 5 పరుగులకే నిష్క్రమించడంతో తన బ్యాడ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ స్వింగ్‌ డెలివరీలతో భారత్ బ్యాటర్లకు చుక్కలు చూపించి రెండు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. తొలి టెస్టు మొదటి రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లకు 51 పరుగులు చేసి 4 నాలుగు వికెట్లు కోల్పోయింది.