calender_icon.png 22 January, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోదాల ‘ధూంధాం’

13-08-2024 12:00:00 AM

-చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన మూవీ ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 13న రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈ నేపథ్యంలో సోమవారం హీరో గోపిచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ‘ధూం ధాం’ టీజర్‌ను విడుదల చేసి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీజర్ చూసి సినిమాలోని వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంతో ఆకట్టుకుంటాయని వారు ప్రశంసలు కురిపించారు.

ప్రేమ, కుటుంబ విలువలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్‌గా రానుందని ఈ టీజర్ కట్ చేసిన తీరు చూస్తే అర్థమవుతోంది. గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేసింది. ఈ సినిమాకి గోపి మోహన్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, సాయి కుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ మాట్లాడుతూ.. మా ‘ధూం ధాం’ సినిమా టీజర్ ను హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీతో వచ్చే 13న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు.