calender_icon.png 24 October, 2024 | 4:02 AM

ధీశాలి చోళ లింగయ్య..అక్షర యోధుడు మాణిక్యరావు

17-09-2024 04:48:43 AM

మెదక్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ పోరాట సమయంలో మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య రాయల్ (బ్రిటీష్) ఎయిర్‌ఫోర్స్‌లో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు నాడు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడు. బోస్ సైన్యంలో కమాండర్ హోదాలో పనిచేశాడు. సుభాష్ చంద్రబోస్ కనమరుగయ్యాక లింగయ్య మెదక్‌కు చేరుకున్నాడు. అప్పటికే ఇక్కడ రజాకర్ల దురాగతాలను గమనించిన లింగయ్య వారికి వ్యతిరేకంగా యువకులను కూడగట్టాడు. వారికి ఆయుధాల తయారీలో శిక్షణ ఇచ్చాడు. వారితో పోరాటం చేయించాడు. అలాగే వెల్దుర్తికి చెందిన మాణిక్యరావు తన రచనల ద్వారా యువతలో స్ఫూర్తి రగిలించాడు. ప్రజల్లో చైతన్యాన్ని నింపాడు. ఆయన రచించిన ‘రైతు పుస్తకం’ అనే పుస్తకాన్ని నాటి నిజాం సర్కార్ నిషేధించింది.