calender_icon.png 20 September, 2024 | 6:08 PM

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

20-09-2024 04:11:04 PM

కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి 

సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య 

గజ్వేల్, (విజయక్రాంతి): మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ జి నర్సయ్య గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ... పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సి కనీస వేతనం 26 వేల రూపాయలకు నిర్ణయించాలని డిమాండ్ చేశారు రోజువారి వేతనం కార్మికులను గ్రూపులో ఏర్పాటు చేసి ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రమాద బీమా సౌకర్యం 25 లక్షల రూపాయలు కల్పించాలని మహిళలకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలని , డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కుమార్ సంతోష్ వెంకటేష్ యాదగిరి నర్సింలు లక్ష్మీ యాదమ్మ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు