calender_icon.png 25 January, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

24-01-2025 08:29:02 PM

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి సంస్థల పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా జిఎం దుర్గం రామచందర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటిసి మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ వై రామ్ గోపాల్ మాట్లాడుతూ... సింగరేణి కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని భూగర్భగనులో పనిచేస్తున్న కార్మికులకు భూగర్భ గని అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

మైన్స్ చట్టాల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు సెలవులు, సిక్ లీవులు పండగ సెలవులు ఇవ్వాలని కోరారు. నాగాల పేరుతో కార్మికులకు జరిమానా విధించే నల్ల చట్టాలను రద్దు చేయాలని సింగరేణి ఏరియాలో మిగిలిన క్వార్టర్ లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లెల రామ నరసయ్య, ఆవుల నాగరాజు, సురేందర్, కుమారస్వామి, అవినాష్, ప్రవీణ్ కుమార్, రాము, సాయి ప్రకాష్, చారి, రవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.