28-03-2025 12:04:32 AM
ఖమ్మం, మార్చి 27( విజయక్రాంతి):- ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న 16 వేల ఆసరా పెన్షన్ల ను తక్షణమే మంజూరు చేయాలని , బోదకాలు బాధితులను వికలాంగులుగా గుర్తించాలని,ఎన్నికల నాడు పెన్షన్లు పెంచుతానాన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ,సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా నిర్వహించారు.
ధర్నాను ఉద్దేశించి మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య,, ఆవుల అశోక్ ప్రసంగిస్తూ ఆర్థికంగా, సామాజికంగా గౌరవంగా బతికేందుకు చేయూతనిచ్చే ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలుగా పెంచకపోగా ఉన్న వాటిని సుమారు రెండు లక్షలకు పైగా రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచి ఇస్తామన్న పెన్షన్ కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు.
ఖమ్మం జిల్లాలో 16,000 మంది అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారనీ, ప్రభుత్వo స్పందించట్లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు బలమైన ముగ్గురు మంత్రులు ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు జి రామయ్య,ఆవుల అశోక్,డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకుడు సిహెచ్ శిరోమణి,శోభ,కే శ్రీనివాస్ బల్లెపల్లి వెంకటేశ్వర్లు, కే శ్రీనివాస్,సత్తార్,లెనిన్ వెంకటేష్,లక్ష్మణ్, లక్ష్మీనారాయణ,చందు,రామారావు, జాస్మిన్, రమేష్,భద్రయ్య తదితరులు పాల్గొన్నారు