calender_icon.png 21 February, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ధర్నా

15-02-2025 01:30:56 AM

మేడ్చల్, ఫిబ్రవరి 14(విజయ క్రాంతి): ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన శ్రీ చైతన్య స్కూలు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో శుక్రవారం స్కూలు వద్ద ధర్నా చేశారు. యాజమాన్యానికి, విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బయట ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వి ప్రతినిధులు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందుని యాజమాన్యాల ఆగడాలు మితిమీరుతు న్నాయన్నారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. కాగా పాఠశాలకు యాజమాన్యం రెండో రోజు కూడా సెలవు ప్రకటించింది.