calender_icon.png 24 October, 2024 | 8:52 PM

ఈనెల 18 కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

14-09-2024 01:46:00 PM

ఇఫ్టూ జిల్లా కార్యదర్శి దేవరాజ్ పిలుపు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 18న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంఎదుట ఇఫ్టు ఆధ్వర్యంలో జరిగే ధర్నాను పవన నిర్మాణ కార్మికుల విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టీ యూ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ పిలుపునిచ్చారు. శనివారం బెల్లంపల్లి కాంట్రా చౌరస్తాలో భవన నిర్మాణ రంగ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేసే ప్రమాద మరణం, సహజ మరణం, అంగవైకల్యం, పక్షక వైకల్యం, ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కమిటీలు టెండర్లు కు అప్పగించే బాధ్యతనుండి ప్రభుత్వం తప్పుకోవాలన్నారు.

వెల్ఫేర్ బోర్డు కంపెనీ నియమించి నిధులు దారిమల్లకుండా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు వేయకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను కార్మికులకే అందించేలా చూడాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 18న జరిగే మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడితోపాటు ఈ నెల 23 హైదరాబాద్ లోని లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలు కూడా కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రమేష్ ,చరణ్ చంద్రయ్య, వెంకటస్వామిలు పాల్గొన్నారు.