calender_icon.png 27 December, 2024 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలు రైతుల కోసం 4న ధర్నా

01-12-2024 01:31:59 AM

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు

ముషీరాబాద్, నవంబర్ 30 : రాష్ట్రంలో కౌలు రైతుల ను గుర్తించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ముఖ్య రైతు, వ్యవసాయ కార్మి క, కౌలు రైతు సంఘాల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అధ్యక్షుడు విస్సా కిరణ్(రైతు స్వరాజ్య వేదిక) మాట్లాడుతూ. .డిసెంబర్ 4న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద కౌలు రైతులతో కలిసి ప్రజా దర్బార్, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులంతా అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సాగర్ (తెలంగాణ రైతుసంఘం), ప్రభులింగం (రాష్ట్ర కౌలు రైతుల సంఘం) పాల్గొన్నారు.