హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్కులోని ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి సంస్థ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే, పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి రాక పోవడంతో ఎమ్మెల్సీ కవిత నేరుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి..
సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరిం చుకుని బీసీ సమస్యలపై ధర్నా చేపడుతున్నామని తెలియజేశారు. దీంతో సీపీ సీవీ ఆనంద్ అనుమతికి అంగీకరించడంతో శుక్రవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద తలపె ట్టిన ధర్నా యాథావిథిగా జరుగుతుందని జాగృతి సంస్థ ప్రకటించింది.