calender_icon.png 26 December, 2024 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీలో నర్సింగ్ విద్యార్థినుల ధర్నా

08-11-2024 12:00:00 AM

హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థినులు తమ హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ భవనం ఎదుట ధర్నా చేపట్టారు. గాంధీ దవాఖానలో ఉండే నర్సింగ్ కళాశాల హాస్టల్‌ను కోవిడ్ సమయంలో సమీపంలోని బోయిగూడకు మార్చారు.

అయితే, హాస్టల్‌లో మురుగు సమస్య భరించలేకుండా ఉందని విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. దీంతో విద్యార్థినుల ధర్నాపై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి.. బోయిగూడ హాస్టల్‌లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వరకూ గాంధీ దవాఖానలోని 8వ అంతస్తులో తాత్కాలికంగా ఉండాలని సూచించడంతో ధర్నాను విరమించారు.