హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాలు, పెండింగ్ పీఆర్‌సీ బకాయిలను విడుదల చేయాలంటూ ఈ నెల 10న ధర్నా చేపట్టనున్నట్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎం నర్సింహ, ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ ఖన్నా తెలిపారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 9వ తేదీ లోపు తమ పీఆర్‌సీ బకాయిలు, సెప్టెంబర్ నెల జీతం రాకుంటే ఈ నెల 10న ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.