calender_icon.png 11 January, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

11-12-2024 10:44:46 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తూ, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తే, వంట నిర్వహణను ప్రైవేటు వరం చేస్తామని ప్రభుత్వం బెదిరించడం సరైనది కాదని తెలంగాణ మధ్యాహ్నం భోజన కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి హెచ్చరించారు. కార్మికులు తాటాకు చప్పులకు భయపడే రోజులు ఎప్పుడో పోయినాయి. సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వాలకు కార్మిక శక్తి ఏంటో నిరూపిస్తాం అని హెచ్చరించారు. 

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) వెంకటేశ్వర చారికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు అన్నారపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా బెదిరించే పద్ధతిలో ధ్వజమెత్తారు. మార్కెట్లో కోడిగుడ్లు ధర ఒకటి ఏడు రూపాయలు ఉందని కానీ ప్రభుత్వం చెల్లించేది కేవలం ఐదు రూపాయలు మాత్రమే అని మరోవైపు మునిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయని పెరిగిన ధరలు కనుగుణంగా నిత్యవసర వస్తువులు చార్జీలు పెంచమని అడిగితే మధ్యాహ్న భోజన వంట నిర్వహణను ప్రైవేటు సంస్థలకి అప్పజెప్తామంటూ పాలకులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో వేడివేడిగా మంచి పౌష్టికార అందిస్తున్న కార్మికులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అడగడం తప్ప అని వారు ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రం ప్రధానంగా విద్యా రంగంపై దృష్టి పెడుతున్నామని కాకమ్మ కబుర్లు, మానుకొని పెరిగిన ధరలు కనుగుణంగా మేను చార్జీలు పెంచాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి జీవో విడుదల చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుటి, గుర్తింపు కార్డులు, యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పాల్వంచ పట్టణ కార్యదర్శి ఇట్టి వెంకట్రావు మధ్యాహ్న భోజన జిల్లా వ్యాప్తంగా మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండురి ప్రభావతి, పొదెళ్ల మంగ భూక్య క్రాంతి, బుజ్జమ్మ స్వప్న, రోజమ్మ రమాదేవి, నరసమ్మ, పద్మ, రాణి, సుజాత, వసంత, రాణి మల్లేశ్వరి, లలిత తదితరులు పాల్గొన్నారు.